ముడా కేసులో భాగంగా CM సిద్ధరామయ్య, ఆయన భార్య, ఇతరులపై నమోదైన కేసును CBIకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై కర్ణాటక హైకోర్టు ఇవాళ సీఎంకు నోటీసులు పంపింది. స్నేహమయి కృష్ణ వేసిన పిటిషన్పై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, CBI, లోకాయుక్త పోలీసులకు హైకోర్టు నోటీసులు పంపింది. లోకాయుక్త పోలీసులు ఇంతవరకు చేసిన దర్యాప్తు వివరాలను నవంబర్ 25లోగా తమకు సమర్పించాలని కోర్టు కోరింది. తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా వేసింది.