AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణే తమ విధానమని.. తాము రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో పనిచేయమని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తాను కామెంట్స్ చేయనని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసునైనా విచారిస్తామని, గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగినట్లు చెప్పారు.