NLG: మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తదితర పద్ధతులు పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం TG మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ NLG కమిటీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం 2వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి భూపాల్ హాజరై మద్దతు ప్రకటించారు.