HYD: ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దని CM రేవంత్ పోలీసులను ఆదేశించారు. ‘కొందరు అభ్యర్థులు భావోద్వేగంలో ఉన్నారు. వాళ్లపై లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లపై కేసులు పెడితే పోటీపరీక్షల్లో రాణించినా ఉద్యోగులకు అనర్హులు అవుతారు. వీళ్లు గ్రూప్-1 పరీక్షల్లో పాసైతే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతారు.