NGKL: గిరిజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో లింగాల గిరిజన బాలుర వసతి గృహం విద్యార్థులు వివిధ క్రీడల్లో రాణించి జోనల్ క్రీడలకు ఎంపికైనట్లు ఎస్టీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సనాతన బాలస్వామి తెలిపారు. నేడు లింగాలలోని గిరిజన బాలుర వసతి గృహంలో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులను అభినందించారు. అనంతరం విద్యార్థులను సన్మానించి, బహుమతులు ఇచ్చారు.