NGKL: బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం అన్నారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణను ధ్వంసం చేసిందన్నారు.