ప్రపంచానికి భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘NDTV వరల్డ్ సమ్మిట్’లో ప్రసంగించిన ప్రధాని.. “ప్రతి రంగంలో మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మా ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టి 125 రోజులైంది. రూ.9లక్షల కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. 8 కొత్త ఎయిర్పోర్టులకు శ్రీకారం చుట్టాం. స్టాక్ మార్కెట్ సూచీల్లో దాదాపు 7శాతం వృద్ధి నమోదైంది” అని పేర్కొన్నారు.