తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1పై దాఖలైన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. పరీక్ష వాయిదా వేయడానికి నిరాకరించింది. కాగా, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ అభ్యర్థులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. మరి కాసేపట్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు జరగనున్న ఈ పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.