TG: మాజీమంత్రి హరీశ్ రావుపై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను తెలంగాణ ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హరీశ్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు. కాగా, ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు సీఎంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.