TG: మాజీమంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు. రైతుబంధు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్.. ఉన్న పదివేలను ఊడగొట్టిందని మండిపడ్డారు. రైతుబంధు కావాలా?రాబందు కావాలా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుగా రాష్ట్ర పరిస్థితి ఉందన్నారు. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే.. అన్నదాత వెన్ను విరవడమే అని ధ్వజమెత్తారు.