TG: బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వినతి అందించారు. హిందూ దేవాలయాలను పరిరక్షించాలని గవర్నర్ను కోరారు. ధార్మిక సంఘాల నేతలపై కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో అసలు నిఘా వ్యవస్థ పనిచేస్తుందా? అని ప్రశ్నించారు. హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోమని తెలిపారు.