అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా శోభిత పెళ్లి పనులు మొదలుపెట్టేసింది. ఈ మేరకు వారి ఇంట్లో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను శోభిత తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ‘గోధుమ రాయి, పసుపు దంచడం వంటి పనులు మొదలయ్యాయని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.