SKLM: బూర్జ మండలం చీడివలస గ్రామంలో గొర్రెలకు, మేకలకు డీ వార్మింగ్ కార్యక్రమం స్థానిక పశువైద్యాధికారులు సోమవారం నిర్వహించారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో పాడి రైతులు, గొర్రెలు మేకల పెంపకదారులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బీజేపీ మండల అధ్యక్షులు పి. జగన్నాథం, కూటమి నాయకులు సూరపు నాయుడు, ప్రసాదరావు, యాదవ కుల నాయకులు పాల్గొన్నారు.