కృష్ణ: ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తమ అధికారిక ఖాతాలో సోమవారం ట్వీట్ చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్టోబర్ 22 నుంచి 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని APSDMA హెచ్చరించింది.