TG: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మాజీమంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరుల త్యాగాలను ఎప్పటికీ మరవలేమని అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాగా.. ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకు పోలీస్ శాఖ ఫ్లాగ్ డే కార్యక్రమాలను నిర్వహిస్తోంది.