టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్, నటి ఇషా చావ్లా జంటగా నటించిన ‘ప్రేమ కావాలి’ మూవీ 2011లో రిలీజై మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 26న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. HYDలోని సుదర్శన్ థియేటర్లో, వైజాగ్‌లోని సంగం, విజయవాడలోని అలంకార్ థియేటర్లలో మాత్రమే ఇది రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా టికెట్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఇక ఈ మూవీకి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు.