AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు కోర్టు మరో 14 రోజులు రిమాండ్ విధించింది. వెలగపూడిలో మహిళ హత్యకేసులో నందిగం సురేశ్ నిందితుడిగా ఉన్నారు. కస్టడీ ముగియటంతో సురేశ్‌ను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా.. నవంబర్ 4 వరకు మరోసారి రిమాండ్‌ను పొడిగించింది. దీంతో గుంటూరు జిల్లా జైలుకు ఆయన్ని తరలించారు.