సంక్రాంతికి ఈసారి పెద్దగా పోటీ ఉండదని నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తాజాగా తన కామెంట్స్‌పై నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి వస్తుందని, అది తమకు పోటీ కాదని చెప్పినట్లు సృష్టించారని కొందరు అసహనం వ్యక్తం చేశారు. ఆ మూవీ విషయంలో తాను తప్పుగా మాట్లాడలేదన్నారు. సంక్రాంతికి 6 మూవీలు వచ్చినా.. పోటీ ఉండదని చెప్పినట్లు తెలిపారు. కొందరు కావాలనే తన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించారన్నారు.