TDP ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో AP ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితులు అవినాష్, జోగి రమేశ్‌తో సహా మిగిలిన వారంతా విచారణకు సహకరించడం లేదంటూ పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. తదుపరి విచారణ డిసెంబర్ 17కి వాయిదా వేసింది. కాగా, నిందితుల పిటిషన్లపై సెప్టెంబర్ 13న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు విచారణకు సహకరించినంత వరకే రక్షణ ఉంటుందని పేర్కొంది.