కృష్ణ: విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తన భార్య గొంతును కోసి భర్త హత్య చేశాడు. పోలీసుల వివరాల మేరకు.. మృతురాలు షేక్ నగీన కంసాలి పేటలో నివాసముంటూ సమోసాల తయారీ కర్మాగారంలో కూలి పనులు చేస్తున్నారు. భర్త బాజీ పెయింట్ వృత్తిని కొనసాగిస్తున్నాడు. మధ్యాహ్నం బానిసైన బాజి తన భార్య నగీనాతో గొడవపడి ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు.