ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. నవంబర్ 1 నుంచి 19వ తేదీల మధ్య ఎయిరిండియా విమానాల్లో ప్రయాణం చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. భారత్లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఆ విమానాలపై దాడి జరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు. కాగా, గతంలో కూడా పన్నూ ఇలాంటి హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.