NGKL: పెద్దకొత్తపల్లి మండలంలోని వెన్నచర్ల గ్రామానికి చెందిన ఒడ్డె శైలేష్, మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన పాఠకులకు తెలిసిందే. వివిధ గ్రామాల వడ్డెర సంఘం నాయకులు మండల వడ్డెర సంఘం అధ్యక్షులు పసుపుల నరసింహ, ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి రూ.14,500లు ఆర్థిక సహాయం అందజేశారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో లాలు, బంగారి, రమేష్ పాల్గొన్నారు.