TG: రైతులకు గిట్టుబాటు ధర అందించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సంప్రదాయ పంటలు కాకుండా ఉద్యాన పంటల సాగుతో లాభదాయకంగా ఉంటుందని రైతులకు సూచించారు. రైతులకు ఇబ్బంది లేకుండా రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులే చూడాలని.. అన్నదాతలను మోసం చేసే ప్రైవేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.