HNK: WGL,HNK జిల్లాల్లోని పలు డిగ్రీ కాలేజీలు అధికంగా పరీక్ష ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. HNKలోని ఓ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో కాకతీయ యూనివర్సిటీ ఆదేశాల ప్రకారం రెగ్యులర్ పరీక్ష ఫీజు ఒక్కొక్కరికి రూ.750 ఉండగా.. రూ.1500-1980 వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల వసూలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.