»Working Under Revanths Leadership Will Not Leave Bjp Komatireddy Rajagopal Reddy
Rajagopal Reddy:రేవంత్ నాయకత్వంలో పనిచేయడమా..? లేదు.. బీజేపీని వీడనంటోన్న రాజగోపాల్
బీజేపీని విడబోనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కర్ణాటక వేరు.. తెలంగాణ వేరు అని చెప్పారు. పార్టీ విడుతున్నారనే ఊహాగానాలపై ఆయన స్పందించారు.
Working under Revanth's leadership..? Will not leave BJP: Komatireddy Rajagopal Reddy
Rajagopal Reddy:కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో.. హస్తం పార్టీని వీడిన నేతలు తిరిగి ఆ పార్టీలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) తిరిగి కాంగ్రెస్లో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో ఆయన స్పందించారు. అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు. మరో 6 నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయని.. తమ పార్టీని బలహీన పరిచే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ వీడటం లేదని.. బీజేపీలో ఉన్నానని స్పష్టంచేశారు.
కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తన స్నేహితులు అడుగుతున్నారని రాజగోపాల్ (Rajagopal Reddy) గుర్తుచేశారు. అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆయన బ్లాక్ మెయిల్ చేసి రూ.కోట్లు సంపాదించారని తెలిపారు. టీడీపీలో 20 ఏళలు ఉండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని గుర్తుచేశారు. ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని గుర్తుచేశారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన రేవంత్ నాయకత్వంలో పనిచేయాలా అని అడిగారు. అలాగే డబ్బులకు అమ్ముడుపోనని.. పోరాడే వ్యక్తినని వివరించారు.
తప్పుడు ప్రచారం చేసి మునుగోడు ఉప ఎన్నికలో ఓడించారని రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) ఆరోపించారు. కేసీఆర్ను గద్దె దింపేందుకే బీజేపీలోకి వచ్చానని వివరించారు. కర్ణాటక వేరు.. తెలంగాణ వేరు అని రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) తెలిపారు. ఎన్నికలు జరగకముందే రాష్ట్ర కాంగ్రెస్లో విభేదాలు వస్తున్నాయని వివరించారు.
చదవండి: Siddaramaiah Biography:జనతాదళ్ టు కాంగ్రెస్, సెకండ్ టైమ్ సీఎంగా ఛాన్స్, నేపథ్యం ఇదే
పారదర్శకంగా తన కంపెనీకి టెండర్ వచ్చిందని రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) వివరించారు. బీజేపీకి అమ్ముడుపోయానని తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదు.. తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమ ముఖ్యం అన్నారు. అదీ మోడీ, అమిత్ షా నాయకత్వంలోనే అవుతుందని చెప్పారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని ఎవరూ లాబీయింగ్ చేయడం లేదన్నారు.