WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 62వ డివిజన్ కాజీపేట విష్ణుపురిలో కొలువుదీరిన శ్వేతార్క మూలగణపతి దేవాలయంలో నేడు 108 కిలోల విభూదితో స్వామివారికి ప్రత్యేక అభిషేకం జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో శ్వేతార్కుడికి విభూదితో అభిషేకం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేశ్వర్లు శర్మ, కార్పొరేటర్ రవీందర్ పాల్గొన్నారు.