కాకినాడ: రూరల్ ఇంద్రపాలెం పోలీసులు చీడిగలో జరుగుతున్న పేకాట శిబిరంపై ఆదివారం సాయంత్రం దాడి చేశారు. దాడిలో పదిమందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1,26,290 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వీరబాబు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవ్ అన్నారు.