కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మిస్తున్న వకుళమాత అన్నదానం భవన నిర్మాణానికి సోమవారం గోపాలపురం మండలం చిట్యాల వాస్తవ్యులు నందిన రితేష్ 50,116 రూపాయలు వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి విరాళంగా సమర్పించినారు. అనంతరం ఆలయ సిబ్బంది దాతలకు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.