ELR: నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం జిల్లా వైద్యాధికారి మాలిని సందర్శించారు. శిథిలావస్థలో ఆస్పత్రి భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం తాత్కాలిక భవనం ఏర్పాటు చేయడానికి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని మాలిని తెలిపారు. అనంతరం ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు.