ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సోమవారం వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ డే సంధర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించినట్లు వైస్ ప్రిన్సిపాల్ డా పుష్పరాజ్ తెలిపారు. ఈ పోటీల్లో 40 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. విజేతలకు సైన్స్ డే రోజు బహుమతులు అందిస్తామన్నారు. ఈ పోటీలను సైన్స్ అధ్యాపకులు పర్యవేక్షించారు.