VZM: ఆప్కాస్ను రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నెల్లిమర్ల మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు పోస్ట్ కార్డులు పంపారు. ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.