ప్రకాశం: ట్రాన్స్ఫార్మర్లను పగలకొట్టి రాగి తీగలను చోరీ చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. నిందితులు ముఠాగా ఏర్పడి దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాలతో పాటు బాపట్ల జిల్లా బల్లికురవ, అద్దంకి, కొరిశపాడు మండలాలలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు.