ELR: వ్యవసాయ సాగులో ప్రతి రైతు వ్యవసాయ శాఖ సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ శాఖ ఏలూరు జిల్లా అధికారి హబీబ్ భాష అన్నారు. సోమవారం నూజివీడు మండలం అన్నవరం రైతు సేవా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతు విశిష్ట సంఖ్య నమోదు వివరాలను స్థానిక వ్యవసాయ శాఖ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.