ఇళ్ల పట్టాలు, కడప స్టీల్ ప్లాంట్‌పై ప్రొద్దుటూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. అనంతరం సీపీఐ నేత సుబ్బరాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా కూడా రెవెన్యూ యంత్రాంగం ఇంటి స్థలాలపైన ఇప్పటికీ ఇంటి సర్వేలు జరపలేదని.. దీన్ని సీపీఐ వ్యతిరేకిస్తుందని చెప్పారు.