KDP: యువత ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్ విడిచిపెట్టి ట్రాఫిక్ నియమ నిబంధనలను అనుసరించి వాహనాలను నడపాలని కడప ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డీకే జావేద్ సూచించారు. సోమవారం చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాలన్నారు.