VZM: మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న జిల్లాలో మాంసం విక్రయాలపై నిషిధం విధించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి ఐక్యవేదిక అధ్యక్షుడు మద్దిల సోంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రజారోగ్య శాఖాధికారి డా.కొండపల్లి సాంబమూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. హిందూ పవిత్ర పర్వదినాల్లో కూడా మాంసం విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయని అన్నారు.