మంచిర్యాల: జన్నారం మండలంలోని పోన్కల్ తండాలో ఉన్న సేవాలాల్ మందిర్లో నిర్వహించే సేవాలాల్ దీక్షకు సంబంధించిన కరపత్రాలను ఆ దేవాలయ కమిటీ సభ్యులు, బంజారా సంఘం నాయకులు విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం వారు సేవాలాల్ దీక్షకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. మహాశివరాత్రి నుండి 41, 21,11 రోజుల సేవాలాల్ దీక్షను స్వీకరించవచ్చన్నారు. ఆసక్తి గలవారు సంప్రదించాలన్నారు.