GDWL: అలంపూర్లో వెలసిన బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ దేవి ఆలయాల్లో రేపటి నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ పురందర్ కుమార్ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. 25న ఉదయం గో ప్రదక్షణ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, సాయంత్రం ధ్వజారోహణ, 26న స్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం స్వామి అమ్మవారి కళ్యాణం ఉంటుందని తెలిపారు.