APT: గుత్తి కోట ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి పాఠశాల సమీపంలో ఉన్న బావిలో ఈతకు వెళ్లి గల్లంతై మృతి చెందిన విషయం తెలిసిందే.ఆదివారం డిప్యూటీ డీఈవో శ్రీదేవి విద్యార్థి గల్లంతై మృతి చెందిన బావిని పరిశీలించారు. అనంతరం విద్యార్థి చదువుతున్న జడ్పీ ఉన్నత పాఠశాలనూ పరిశీలించారు. ఘటనకు సంబంధించిన విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.