CTR: గుడిపల్లె మండలంలోని మల్లప్పకొండపై వెలసిన మల్లేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా 26వ తేదీన కుప్పం ఆర్టీసీ బస్టాండ్ నుంచి 15 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ గోపినాథ్ పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు బస్సుల రాకపోకలు జరగనున్నాయని ఆయన తెలిపారు.