NGKL: వెల్దండ మండలంలోని సేరి అప్పా రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పడమటి తండాకు చెందిన రాజు గుండె వ్యాధితో బాధపడుతూ ఇటీవల హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన బంధువులు స్నేహితులు రాజుకు ఆదివారం 60 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయనకు కొంతమేర సాహయం అందించామని రాములు నాయక్ తెలిపారు.