హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో హైడ్రామా జరిగింది. రెండు చిత్రాల ప్రదర్శన కోసం యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు పోటీపడ్డాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య వామపక్ష విద్యార్థి సంఘం అయిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ని యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శించారు. లేడీస్ హాస్టల్లో ఈ డాక్యుమెంటరీని ప్లే చేశారు. అదే సమయంలో ఏబీవీపీ కార్యకర్తలు కశ్మీర్ ఫైల్స్ సినిమాను నార్త్ బ్లాక్‌లో చూపించారు.
భారత ప్రభుత్వం నిషేధించిన ఈ డాక్యుమెంటరీని యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శించడం సరికాదంటూ యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఏబీవీపీ కార్యకర్తలు.అంతకు ముందు కాసేపు క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీబీసీ వీడియో ప్లే చేసేందుకు ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సిద్ధమవ్వగా.. పోటీగా కశ్మీర్‌ఫైల్స్ ప్రదర్శించేందుకు ఏబీవీపీ నేతలు ప్రయత్నించారు. అయితే ఏబీవీపీ కార్యకర్తలను భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో హైటెన్షన్ క్రియేట్ అయ్యింది. వర్సిటీ యాజమాన్యం లెఫ్ట్ యూనియన్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.