»Show Cause Notice To Congress Leader Maheshwar Reddy
High command : కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసు..
ఏఐసీసీ (AICC) కార్యక్రమాల అమలు కమీటీ చైర్మెన్ మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) కి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీస్ పంపింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారని, కేవలం గంట లోపు తన వివరణ ఇవ్వాలని టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ సూచించింది. ఇదిలా ఉంటే మరో వైపు మహేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు (Congress leaders) బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏఐసీసీ (AICC) కార్యక్రమాల అమలు కమీటీ చైర్మెన్ మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) కి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీస్ పంపింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారని, కేవలం గంట లోపు తన వివరణ ఇవ్వాలని టీపీసీసీ (TPCC) క్రమశిక్షణ కమిటీ సూచించింది. ఇదిలా ఉంటే మరో వైపు మహేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు (Congress leaders) బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ,మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేశారు. అయితే మహేశ్వర్ రెడ్డి షోకాజ్ నోటీసు పై స్పందిస్తూ.. తాను పార్టీ లైన్ ను దాటలేదని తెలిపారు.ఇదిలా ఉండగా, గత కొంత కాలంలో మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ కార్యక్రమాలు (Activities)కు దూరంగా ఉంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ (TPCC Chief Revanth) వ్యవహరాలు నచ్చక..అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతోనే ఇటీవల కాంగ్రెస్‌పార్టీ చేసిన ధర్నాలు, నిరసనలు, ఆందోళనల్లో ఎక్కడ పాల్గొనలేదు.
రేవంత్ వైఖరి సరిగ్గా లేదని ఢిల్లీ హై కమాండ్ (High command) కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని గతంలో మహేశ్వర్‌రెడ్డి తన సన్నిహిత వర్గాలకు చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీని మహేశ్వర్ రెడ్డి వీడనున్నట్లు సమాచారం. ఢిల్లీ(Delhi) కి వెళ్లి బీజేపీలోకి చేరే అవకాశం ఉన్నట్లు పొలిటికల్(Political) వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ మహేశ్వర్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎలాంటి రెస్పాన్స్ కాలేదు. కానీ బీజేపీ(BJP)తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతోనే నోటీసులు ఇచ్చినట్లు గాంధీభవన్‌లోని ప్రచారం జరుగుతున్నది. ఎంపీ ఉత్తమ్ (MP Uttam) మనిషిగా ఏలేటి కి పేరు ఉన్నది. దీంతో నేరుగా ఉత్తమ్ బుజ్జగించినా ఏలేటి వినలేదని తెలిసింది.