సీనియర్ కాంగ్రెస్ నేత భట్టి విక్రమాార్క పోస్ట్ చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీఎం ప్రకటన కోసం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్ర సీఎం ప్రకటన అధికారికంగా వెలువడనుంది.
Senior Congress leader Mallu Bhatti Vikramarka's tweet went viral
Bhatti Vikramarka: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఎన్నికల్లో ఊహించని మెజారిటీని కైవసం చేసుకుంది కాంగ్రెస్. ప్రస్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకోసం వరుస భేటీలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), భట్టివిక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీతో భేటీ నిర్వహించారు. ఈ క్రమంలో మల్లు భట్టి విక్రమార్క ఎక్స్ యాప్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ‘ప్రతి పేదవాడి గుండె తాకిన క్షణాలు.. గుండె నిండా ఆత్మ స్థైర్యం, కుంగిపోతున్న జీవితాలకు ఈ అరాచక పాలన నుండి విముక్తి ఇవ్వాలన్న లక్ష్యం, నైరాశ్యంలో ఉన్న క్షేత్రస్థాయి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలన్న ఆశ.. ఇవే నా పాదయాత్రకు ఆయువు పోసి నడిపించాయి. దట్టమైన గుట్టలు, పొగలు కక్కే రోడ్డులు, వేల అడ్డంకులు.. మండుటెండలు, వడగాళ్ల వానలు, ఎముకలు వణికించే చలి.. కాలేదు ఏవి మన సంకల్పానికి అడ్డు..’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటు 1364 కిలో మీటర్లు, 109 రోజులు తను పాదయాత్ర చేశానని, ఆయన అడుగుపెట్టిన అన్ని నియోజకవర్గాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించిందని వెల్లడించారు.