తెలంగాణ లో గ్రూప్-4 దరఖాస్తుల గడువు ముగిసింది. రికార్డు స్థాయిలో 9,51,321 దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ కింద 8,180 పోస్టులకు టీఎస్పీఎస్సీ దరఖాస్తులను నిర్వహించింది. వాస్తవానికి జనవరి 30వ తేదీతో గ్రూప్-4 దరఖాస్తులకు గడువు ముగిసింది. ఆ రోజు వరకు 8,47,277 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 29న 49 వేలు, 30వ తేదీన 34,247 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ మూడు రోజుల వ్యవధిలో 1,04,044 దరఖాస్తులు కొత్తగా వచ్చాయి. గ్రూప్-4 రాతపరీక్ష జులై 1న నిర్వహించనున్నట్లు నిన్న టీఎస్పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే.