దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై అధికార అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై మరోసారి మంత్రి కేటీఆర్ స్పందించారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి (Kotta Prabhakar Reddy)పై హత్యాయత్నం చేసింది కాంగ్రెస్ గూండానేనని మంత్రి కేటీఆర్ మరోసారి ఆరోపించారు.నిందితుడు ఫేస్బుక్లో కాంగ్రెస్ పార్టీ (Congress party) నాయకుడినంటూ చేసిన పోస్టు, ప్రచారంలో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. ఇంకా ప్రూఫ్స్ కావాలా రాహుల్ గాంధీ (Rahul Gandhi) అని కేటీఆర్ ప్రశ్నించారు. అందులో ‘జై కాంగ్రెస్ మిరుదొడ్డి మండల్’ అని రాజు రాసుకున్నాడు. రాజు మెడలో కాంగ్రెస్ కండువా కూడా ఉంది. అందులో అతడికి 2,400 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. రాజు దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంపీ ప్రభాకర్ ప్రస్తుతం సికింద్రాబాద్(Secunderabad)లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దాడిలో ఆయన చిన్నపేగులోని కొంతభాగం దెబ్బతినడంతో ఆపరేషన్ (Operation) చేసి వైద్యులు దానిని తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్‌గానూ పనిచేస్తున్నాడు. వివాదాస్పదుడిగా రాజుపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో చోట, ఒక్కో రకంగా జర్నలిస్టునంటూ, రాజకీయ నేతనంటూ పలువురిని బెదిరింపులకు గురిచేసి డబ్బులు వసూలు చేసేవాడని స్థానికులు చెప్పారు.కాగా ఎంపీపై దాడి వెనుక ఉన్నది ఎవరు? నిందితుడు ఎందుకు హత్యాయత్నానికి పాల్పడ్డాడు అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంపీ హత్యాయత్నం ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ (BRS) నాయకులు మంగళవారం దుబ్బాక నియోజకవర్గం బంద్‌కు పిలుపునిచ్చారు.