• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి: CP

NZB: ప్రతీ సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని, దీనిని సమస్యలు ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలు తమకు సమస్యలను పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో విన్నవించి వాటిని పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 08:05 PM IST

‘ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి’

KNR: వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసి త్వరగా పూర్తి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. భూసేకరణ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎక్కడ జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో KNR, HUZ ఆర్డీవోలు, సమావేశమయ్యారు.

February 21, 2026 / 08:05 PM IST

పీయూలో చెస్, తైక్వాండో సెలక్షన్స్

MBNR: పాలమూరు యూనివర్సిటీలో ఈనెల 23న చెస్ మెన్ సౌత్ జోన్ ఎంపికలు, ఆలిండియా తైక్వాండో మెన్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ డా. వై. శ్రీనివాసులు తెలిపారు. ఎంపికైన చెస్ క్రీడాకారులు మార్చి 1-5 వరకు తిరుచిరాపల్లి సౌత్ జోన్ పోటీల్లో, తైక్వాండో క్రీడాకారులు మార్చి 2-6 వరకు జలంధర్‌లో జరిగే ఆలిండియా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

February 21, 2026 / 08:05 PM IST

‘వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలి’

ADB: రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బేల మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నాయకులు రాందాస్, సంతోష్ రావు, అశోక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

February 21, 2026 / 08:04 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ MLA

BHPL: రేగొండ మండలం రామన్నగూడెం తండాకు చెందిన గుగులోతు వీరునాయక్ -శాంతి కుమార్తె ఉమా – విజేందర్ వివాహ మహోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో BRS నేతలు ఉన్నారు.

February 21, 2026 / 08:04 PM IST

మీసేవ మొబైల్ యాప్‌పై జిల్లాస్థాయి శిక్షణ

BDK: జిల్లాలో మీసేవ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా శనివారం కొత్తగూడెం జిల్లాలోని నయాబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ జీపీవోలకు మీసేవ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు నిర్వహించబడింది.

February 21, 2026 / 08:02 PM IST

‘సీఎం, మంత్రుల పర్యటనతో రైతులకు ఒరిగేది ఏమీ లేదు’

WGL: జిల్లాలో సీఎం, మంత్రుల పర్యటనలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. HNK పట్టణ కేంద్రంలోని BRS కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి 2 రెండేళ్లు గడిచిన ఎందుకు పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:02 PM IST

గృహప్రవేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే

SDPT: బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. లబ్ధిదారులకు అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:01 PM IST

మాజీ DCC అధ్యక్షుడు వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి

MLG: జిల్లా మాజీ DCC అధ్యక్షుడు దివంగత నల్లెల్ల కుమారస్వామి మూడవ వర్ధంతి వేడుకలు జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై, కుమారస్వామి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

February 21, 2026 / 07:59 PM IST

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు

VKB: వార్డు సభ్యుల శిక్షణ తరగతులు ముగిశాయని కుల్కచర్ల ఎంపీడీవో రామకృష్ణ నాయక్ తెలిపారు. గత ఐదు రోజులుగా మండల పరిషత్ కార్యాలయంలో 11 గ్రామాలకు చెందిన వార్డు సభ్యులకు గ్రామ పరిపాలనపై అధికారులు వార్డు సభ్యులకు అవగాహన కల్పించారు. 33 గ్రామ పంచాయతీల గాను మొదటి విడత శిక్షణ తరగతులు ముగిశాయని, మిగతా గ్రామ వార్డు సభ్యులకు త్వరలోనే శిక్షణ ఇస్తామన్నారు.

February 21, 2026 / 07:57 PM IST

ధన్వాడ వాసికి అవార్డు

NRPT: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు కవుల మహాసభలో ధన్వాడ యువ రచయిత, రంగస్థలం నటుడు మల్కమల్ల బాలకృష్ణ గౌడ్ పొట్లూరి హరికృష్ణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన తెలుగు భాషకు చేస్తున్న సేవలను గుర్తించి అవార్డు అందజేశారు.

February 21, 2026 / 07:54 PM IST

గద్వాలలో దివ్యాంగుల గ్రీవెన్స్ డే

GDWL: గద్వాల కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన దివ్యాంగుల గ్రీవెన్స్‌లో 37 దరఖాస్తులు అందినట్లు అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని, సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రతి నెల మూడో శనివారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తారని తెలిపారు.

February 21, 2026 / 07:52 PM IST

ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఖండన

MBNR: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నివాసంపై జరిగిన దాడిని జిల్లా ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ప్రజా ప్రతినిధి ఇంటిపై దాడి యత్నం అధికార కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలని మండిపడ్డారు. ఎమ్మెల్యే సవాలును ఎదుర్కోలేక రౌడీలను పురమాయించడం ప్రతీకార రాజకీయమని విమర్శించారు.

February 21, 2026 / 07:50 PM IST

రంజాన్ ఏర్పాట్లపై మున్సిపల్ ఛైర్మన్ కు వినతి

RR: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షాద్ నగర్ పట్టణంలో తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్ మున్సిపల్ ఛైర్మన్ బస్వంను కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో వారిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. మసీదుల వద్ద వీధి దీపాల ఏర్పాటు, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు.

February 21, 2026 / 07:48 PM IST

HYD గచ్చిబౌలి స్టేడియంలో హాకీ వరల్డ్ కప్

HYD: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 8 నుంచి 14 వరకు జరిగే FIH హాకీ వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్స్ కోసం భారత మహిళల సీనియర్ హాకీ జట్టు కీలక పోరాటానికి సిద్ధమైంది. ఈ టోర్నీలో విజయం సాధిస్తేనే వరల్డ్ కప్‌కు అర్హత లభిస్తుంది. వేగవంతమైన దాడులు, కట్టుదిట్టమైన రక్షణ, పెనాల్టీ కార్నర్ మార్పిడి జట్టు విజయానికి ప్రధానంగా మారనున్నాయి.

February 21, 2026 / 07:48 PM IST