ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై(Governor Tamilsai) ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామాల ఆదివాసీల ప్రజలు వారి సమస్యలను గవర్నర్‌కు విన్నవించారు. అంధ్రలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని ఆదివాసీలు కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కోడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రకాల వ్యాధి గ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు(doctors) చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే వెదర్ రిపోర్ట్ సైతం సూచనలు చేసింది.
ఇటీవల కర్నాటకలో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాతైనా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి రాలేదని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(gutta sukender reddy) వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఏమన్నారో ఇక్కడ చుద్దాం.
23 మంది కూలీలతో వెళ్తున్న ఆటో అనుకోకుండా ప్రమాదానికి గురైంది. ఓ లారీ వచ్చిన ఆటోను ఢీకొనగా..ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయంలో తొలిసారి కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
దేశ ప్రజలు కేరళ స్టోరీ (The Kerala Story) సినిమాను వాస్తవానికి అనుగుణంగా తీసినట్టు భావిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. దేశంలో కొంతమంది మతం పేరుతో కుట్రలు చేస్తున్నారని, అలాంటి ఘటనలను యావత్ సమాజం ఖండించాలని కిషన్‌రెడ్డి చెప్పారు
యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్‌ఛార్జ్ ప్రశాంత్ పై వేటు పడింది. మాజీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంతో ప్రశాంత్ పై అధిష్టానం వేటు వేసింది. అతనిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ప్రశాంత్ టీమ్ పై 154, 157 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మే 17వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ...
ఇవాళే సీబీఐ విచారణకు వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి (YS Sunitha Reddy), భర్త రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే రెండుసార్లు ఈ ఇద్దరూ సీబీఐ ఎదుట హాజరవ్వగా.. తాజాగా మరోసారి విచారణకు రావడంతో ఉత్కంఠ నెలకొంది.
వైఎస్సార్ టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఖండించారు. విలీనమే చేయాలనుకుంటే పార్టీ ఎందుకు పెడతానన్నారు.
సీబీఐ అధికారులు మరోసారి అవినాశ్ కు నోటీసులు జారీ చేసింది. మే 19న విచారణకు రావాలని ఆదేశించింది.సీబీఐ నాలుగు రోజులు గడువు ఇవ్వటంతో అవినాశ్ రెడ్డి హైదరాబాద్ (Hyderabad) నుంచి పులివెందులకు బయల్దేరి వెళ్లారు. అవినాశ్ దారి మద్యలో ఉండగానే సీబీఐ ఆయనకు వాట్సాప్ ద్వారా 19న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు
మధ్యప్రదేశ్, రాజస్థాన్ లపై కమల నాథులు పోకస్ చేశారు. కర్ణాటకలో జరిగిన తప్పులను మరే రాష్ట్రంలో జరుగకూడదని జాగ్రత్త పడుతున్నారు. రానున్న పలు రాష్ట్రాల ఎన్నికలపై లోకల్ నాయకులను రెడీ చేస్తున్నారు.