»A Lorry Collided With An Auto Five Dead Seven Injured Palnadu District Ap
Accident: ఆటోను ఢీకొన్న లారీ..ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు
23 మంది కూలీలతో వెళ్తున్న ఆటో అనుకోకుండా ప్రమాదానికి గురైంది. ఓ లారీ వచ్చిన ఆటోను ఢీకొనగా..ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మిర్చి పంట ఏరేందుకు ఉదయమే ఆటోలో బయలుదేరిన కూలీలకు ఆకస్మాత్తుగా యాక్సిడెంట్ జరిగింది. ఓ లారీ వచ్చి ప్రమాదవశాత్తు ఆటోను ఢీ కొట్టగా..అందులోని వ్యక్తులు ఎక్కడికక్కడ ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఐదురుగు మృతి చెందగా..10 మందికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో 23 మంది ఉన్నట్లు తెలిసింది.
గాయపడిన వారిని స్థానికులు సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ విషాద ఘటన ఏపీ(AP)లోని పల్నాడు జిల్లా(palnadu district)లో చోటుచేసుకుంది. మరోవైపు కూలీలు మొత్తం నల్గొండ జిల్లా దామరచర్ల నరసాపురం వాసులుగా గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.