A vehicle fell in the valley of Kupwara district in Kashmir for dead and 10 injured
జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని కర్నాహ్లోని నవగబ్రా ప్రాంతంలో సుమో వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ క్రమంలో గాయపడిన క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నారు. ఇక మృతుల్లో సైదా బానో (22), మహ్మద్ సయీద్ రైనా (55), రజియా బానో (18), నుస్రత్ బేగం (35) ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అయితే అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీంతోపాటు డ్రైవర్ మద్యం ఏదైనా సేవించి డ్రైవింగ్ చేస్తున్నాడా? లేదా ప్రమాదానికి మరేదైనా కారణం ఉందా వంటి అనేక వివరాలు పోలీసులు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Viral News: కుర్కురే దొంగిలించారని నలుగురు పిల్లలను కట్టేసి కొట్టిన యజమాని

